అబ్బో..సగం కారు డ్యామేజ్..అక్కడ థర్డ్ ప్లేస్?

-

పైన పటారం…లోన లొటారం…ఇదే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో జరిగేది అని చెప్పొచ్చు…ఎందుకంటే అధికారంలో ఉండటం వల్ల పైకి టీఆర్ఎస్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది…కానీ కింది స్థాయిలో పార్టీ పరిస్తితి చూస్తే చాలా వరకు దిగజారిపోయిందనే తెలుస్తోంది…ఇంతకాలం సరైన ప్రత్యర్ధి లేకపోవడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేనట్లే ఉంది…కానీ ఇప్పుడు సీన్ మారింది…ఓ వైపు బీజేపీ ఊహించని విధంగా రేసులోకి వచ్చింది…అటు కాంగ్రెస్ సైతం ఫామ్ లోకి వచ్చింది..దీంతో టీఆర్ఎస్ లోని లొసగులు అన్నీ బయటపడుతున్నాయి. ఏదో పార్టీలో అధినేత కేసీఆర్, తర్వాత కేటీఆర్, హరీష్ రావు…ఇంకా 10-15 మంది నేతలే స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు తప్ప…మిగిలిన వారంతా వీక్ అయిపోయారని తెలుస్తోంది..చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో బలం కోల్పోయారని తెలుస్తోంది.

2018 ముందస్తు ఎన్నికలో కూడా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది…కానీ అప్పుడు కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం పనికొచ్చి మళ్ళీ గెలిచేశారు…అయితే ఈ సారి సెంటిమెంట్ అస్త్రాలు పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేవు…కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న కారు ఎమ్మెల్యేలని ఈ సారి ఎవరూ కాపాడలేరని అర్ధమవుతుంది. అయితే ఇప్పటికే పీకే టీం కారు పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇక పీకే టీం చేసే సర్వేల్లోనే సగంపైనే కారు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ సిటింగ్‌లలో సగానికిపైగా ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, వారికి తిరిగి టికెట్లు ఇస్తే పార్టీకి ప్రమాదమని పీకే బృందం నిర్వహించిన సర్వేల్లో తేలిందట. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ లోని ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందట…ఇంకా చెప్పాలంటే అక్కడ టీఆర్ఎస్ మూడో స్థానంలోకి పడిపోయిందట. అంటే కారు పార్టీకి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు..ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన సరే…డ్యామేజ్ కంట్రోల్ చేయడం కష్టమని తెలుస్తోంది. ఇక సగం మంది సిటింగ్ ఎమ్మెల్యేలని సైడ్ చేసి కొత్తవాళ్ళకు సీట్లు ఇస్తే కారు ఏమన్నా రేసులో ఉండొచ్చు…లేదంటే కారు అస్సాం వెళ్లిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news