కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న వేళ ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఐతే సెకండ్ వేవ్ లో కేసులు తగ్గుతున్న కొలదీ థర్డ్ వేవ్ ముప్పుపై ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కరోనా థర్డ్ వేవ్ పై ప్రధానమంత్రి సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. థర్డ్ వేవ్ పై ప్రధాని మాట్లాడిన మాటలు ఆసక్తి రేపుతున్నాయి. థర్డ్ వేవ్ ను తిప్పికొట్టేందుకు వ్యూహాలు అమలు చేయాలని, వైద్య విభాగం సంసిద్ధంగా ఉండాలని ప్రధాని సూచించారు.
ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో థర్డ్ వేవ్ రావచ్చు అన్న సందేహాలున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచాలని, ఆక్సిజన్, లభ్యత, వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచాలని ప్రధాని మాట్లాడారు. దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో బెడ్ల సామర్థ్యం, చిన్నపిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు మొదలగునవి చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఏదేమైనా మరో కరోనా వేవ్ రాకుండా ఉంటే బాగుంటుందని ప్రజలంతా కోరుకుంటున్నారు.