గోదారి ఉగ్రరూపం.. 95 గ్రామాలు జలదిగ్బంధం..

-

గత వారం రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షలు బీభత్సం సృష్టించాయి. దీనికి తోడు ఎగువన కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణలో జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈనేపథ్యంలోనే.. గోదారమ్మ ఉగ్రరూపానికి భద్రాచలం చిగురుటాకులా వణికిపోతోంది. 32 ఏళ్ల తర్వాత నీటిమట్టం 70 అడుగులు దాటింది. గరిష్ఠంగా పోటెత్తిన వరద ప్రవాహం ప్రళయాన్ని తలపించింది. భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి పది గంటలకు 24.29 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. అక్కడ గంటగంటకు వరద పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనల చెందుతున్నారు. ఇప్పటికే ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీవాహక ప్రాంతంలో గోదావరి వరద ఉద్ధృతికి 95 గ్రామాలు నీటమునిగాయి. 77 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 6,155 కుటుంబాలకు చెందిన 20,922 మందిని ఈ కేంద్రాలకు తరలించారు అధికారులు. అర్ధరాత్రి దాటిన తర్వాత వరద నిలకడగా మారుతుందని ప్రచారం సాగినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ముంపు తీవ్రత రెట్టింపయింది. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిని, సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు ఈ సమస్య తీవ్రస్థాయిలో తలెత్తడంతో సమాచార వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. అయితే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అక్కడి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ దిశనిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version