వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నారా..? అయితే ధర ఎంతో చెక్ చేసుకోండి…!

-

కోవిడ్ 19 వాక్సిన్ ఇప్పుడు 18 ఏళ్లు దాటిన వాళ్లకి కూడా అందుబాటులో ఉంది. ఇప్పటికే చాలా మంది కరోనా వ్యాక్సిన్ టీకానీ వేయించుకున్నారు. ఇప్పుడు భారత దేశం లో మూడవ ఫేస్ అవుతోంది. మొట్టమొదటి ఫేస్ లో కేవలం హెల్త్ కేర్ వర్కర్స్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్స్ కి వ్యాక్సిన్ వేశారు.

అదే రెండో ఫేస్ లో 45 ఏళ్లు దాటిన వాళ్లకి వాక్సిన్ వేయడం మొదలుపెట్టారు. మన భారత దేశం లో కోవి షీల్డ్ మరియు కోవ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవి షీల్డ్ మరియు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవ్యాక్సిన్.

ఇదిలా ఉంటే ఇప్పుడు మూడో వ్యాక్సిన్ కూడా వచ్చింది. అదే స్పుట్నిక్. దానిని మొదట విదేశాల్లో తయారు చేశారు. అయితే ఇప్పుడు ఇండియాలో కూడా దానిని మాన్యుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు.

కోవిషీల్డ్ మరియు కొవ్యాక్సిన్ ధరలు చూద్దాం:

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ కోవిషీల్డ్ 400 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటుంది. భారత్ బయోటెక్ covid19 వాక్సిన్ కొవ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 400 రూపాయలకి అందుబాటులో ఉంటుంది.

ప్రైవేట్ ఆస్పత్రిలో ధర ఎంత అంటే..?

కోవిడ్ 19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ ప్రైవేట్ ఆస్పత్రిలో 600 రూపాయలు గా ఉంది. అదే కోవ్యాక్సిన్ ప్రైవేట్ ఆసుపత్రిలో 1200 రూపాయలుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news