Tokyo Olympics 2020: బంగారు పతకాన్ని పూర్తిగా బంగారంతో తయారు చేయరు…!

-

ఈరోజు నుండి ఆసక్తితో ఎదురు చూస్తున్న ఒలింపిక్స్ మొదలైపోయాయి. Tokyo Olympics ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి మెడల్స్ ఇస్తారన్న సంగతి అందరికీ తెలుసు. అయితే వీటిలో బంగారం, రజతం, బ్రాంజ్ మెడల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బంగారు పతకాన్ని.. సెకండ్ వచ్చిన వాళ్ళకి రజత పతకాన్ని.. థర్డ్ వచ్చిన వాళ్లకి బ్రాంజ్ పతకాన్ని ఇస్తారు.

ప్రతి సంవత్సరం కూడా ఇలానే క్రీడాకారులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రోజు పతకాలకి సంబంధించి కొన్ని విషయాలను చూద్దాం. నిజంగా ఈ విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అన్ని పతకాలకి కూడా కొన్ని గుర్తులు ఉంటాయి.

ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ పతకాలలో ఐదు రింగుల సింబల్ (five rings symbol), నైక్ (Nike, the Greek goddess of victory) వంటివి మెడల్ మీద ఉంటాయి.

అదే విధంగా మెడల్ మీద మనం థీమ్ ని కూడా చూడొచ్చు. ఈ పతకాల మీద కొన్ని రకాల రాళ్లు ఉన్నాయి. “light and “brilliance” థీమ్ ని పతకం పైన రాళ్లు సూచిస్తాయి. లైట్ అనేది క్రీడాకారులు యొక్క ఎనర్జీని సూచిస్తుంది.  అదే విధంగా వాళ్ళకి ఉండే సపోర్ట్ ని కూడా చెబుతుంది. బ్రిలియంట్ అంటే స్నేహపూర్వక తత్వాన్ని సూచిస్తుంది అని టోక్యో ఒలింపిక్స్ కమిటీ చెబుతోంది.

అలానే వాళ్ళ యొక్క పతాకాన్ని విక్టరీ మెడల్ రిబ్బన్ తో అటాచ్ చేసి ఇస్తారు. అదే విధంగా గెలుపొందిన వారికి విభిన్నంగా ఉండే మెడల్ కేస్ ఇస్తారు. అయితే ఏ రెండు కూడా ఒకేలా ఉండవు.

వీటిని ఎవరు డిజైన్ చేసారు..?

ఈ మెడల్స్ ని ఎవరు డిజైన్ చేశారు అనేది చూస్తే.. జపాన్ సైన్ డిజైన్ అసోసియేషన్ మరియు ఒసాకా డిజైన్ సొసైటీ డైరెక్టర్ Junichi Kawanishi రూపొందించారు.

ఇవి పూర్తి బంగారానివా..?

అయితే బంగారు పతకాలు పూర్తి బంగారంతో చేసినవి కాదు. కేవలం ఆరు గ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. మిగిలినదంతా కూడా రజతం. అయితే సిల్వర్ పతకం మాత్రం పూర్తి సిల్వర్ తో తయారు చేయడం జరిగింది. రెడ్ బ్రాస్ తో బ్రాంజ్ మెడల్ ని తయారు చేశారు. అంటే 95% ఇందులో కాపర్ ఉంటే ఐదు శాతం జింక్ ఉంటుంది.

వీటిని ఎలా తయారు చేస్తారు..?

పాత మొబైల్ ఫోన్స్ మరియు ఎలక్ట్రానిక్ సామాన్లని కలెక్ట్ చేసి ఈ మెడల్స్ ని రూపొందించారు. 78 టన్నుల ఎలక్ట్రానిక్ సామాన్లని సేకరించి వీటిని రూపొందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version