60 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త… నెలకు రూ. 3వేలు పెన్షన్ !

-

60 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త. అసంఘటిత కార్మికులకు మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్ యోజనను అమలు చేస్తోంది. ఆ సంగటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఈ పింఛను పథకం ఎంతో మేలు చేస్తుంది. ఇది వారి భవిష్యత్తును ఆర్థికంగా, దృఢంగా, భద్రంగా మారుస్తుంది.

ప్రధాని మోడీ
ప్రధాని మోడీ

కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద శ్రామికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలకు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెలా కనీసం రూ. 3 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. అంతేకాదు పింఛను పొందే సమయంలో ఎవరైనా మరణిస్తే లబ్ధిదారుని భార్య లేదా భర్త పెన్షన్ కింద పొందే మొత్తంలో 50% కుటుంబ పెన్షన్ గా పొందుతారు. ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్ యోజనలో చేరడానికి, మీరు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా కలిగి ఉండటం తప్పనిసరి. పథకం కోసం నమోదు చేసుకోవడానికి, మీరు మీ సమీప అధికారిక వెబ్సైట్ కి కానీ సెంటర్ కు కానీ వెళ్లాలి.

Read more RELATED
Recommended to you

Latest news