గర్భిణీలకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్..!!

-

కేంద్ర ప్రభుత్వం గర్భిణీలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రసవించిన మహిళలకు ఆర్థిక సాయం చేస్తోంది. ఇందుకోసం ప్రవేశపెట్టిన పథకం కింద గర్భిణులకు రూ.6 వేలు అందజేస్తున్నారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సహకారం పెంచేందుకు, మహిళలను ఆదుకునేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో వివిధ ఇబ్బందులను ఎదుర్కొనే మహిళల కోసం అమలు చేసిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ పథకం పేరు మాతృత్వ వందన యోజన..

narendra modi

 

ఈ పథకం 2017 నుంచి అమల్లో ఉంది.. అప్పటి నుంచి ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు సాయం చేస్తుంది. తల్లి, పిల్లలు పోషకాహార లోపం తో బాధపడకూడదు అని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..గర్భిణీ స్త్రీల వయస్సు 19 సంవత్సరాలు ఉండాలి. ఈ ప్రోగ్రామ్‌లో మీరు ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకంలో, ప్రభుత్వం 3 వాయిదాలలో 6000 రూపాయలను పంపుతుంది.

ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం జనవరి 1, 2017న ప్రారంభించింది. ఈ పథకంలో గర్భిణులకు దశలవారీగా 1000 రూపాయలు, రెండవ దశలో 2000 రూపాయలు మరియు మూడవ దశలో 2000 రూపాయలు అందజేస్తారు. అదే సమయంలో బిడ్డ పుట్టగానే ప్రభుత్వ ఆసుపత్రిలో చివరి విడతగా 1000 రూపాయలు అందజేస్తారు.ఇంతలో మీరు ఈ పథకంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, మీరు వెంటనే అధికారిక హెల్ప్‌లైన్ నంబర్ 7998799804ను సంప్రదించవచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది… ఒకవేళ మీకు డబ్బులు అందుకుంటే దగ్గరలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించండి..

Read more RELATED
Recommended to you

Latest news