తేలిపోతున్న మంత్రులు..జగన్ పైనే భారం!

-

ఒకప్పుడు మంత్రులు అంటే వారికి సొంత ఇమేజ్ ఉండేది..సొంతంగా పనులు చేసే సత్తా ఉండేది. సి‌ఎం తర్వాత మంత్రుల స్థానానికి గౌరవం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మంత్రులంటే డమ్మీలనే పరిస్తితికి వచ్చేసింది. కేవలం సంతకాలకు తప్ప..ఏమైనా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి వారు పనికి రావడం లేదు. ఈ పరిస్తితి అన్నీ చోట్ల ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.

ఇక ఏపీలో చూసుకుంటే మంత్రుల పరిస్తితి చెప్పుకోవడం వేస్ట్ అన్నట్లు ఉంది. ఎందుకంటే పేరుకే మంత్రులు తప్ప..వారికి పవర్స్ లేవనే పరిస్తితి ఉంది. ఇక శాఖ పరంగా సంతకాలు పెట్టడమే తప్ప..సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్తితి కనిపించడం లేదు. అది ఎలాంటి మంత్రికైనా అదే పరిస్తితి. పైగా సి‌ఎం కూడా కాదు..ప్రభుత్వ సలాదారుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి వీరిపై పెత్తనం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏమైనా సజ్జల చెప్పినట్లే మంత్రులు చేయాలనే పరిస్తితి. అలాగే ఏ శాఖకు సంబంధించి అయినా సజ్జల మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు. అంటే ఆయా శాఖ పరమైన నిర్ణయాలు మీడియాకు చెప్పడంలో కూడా మంత్రులు పాత్ర ఏమి కనిపించడం లేదు.

ఇక కొందరు మంత్రులు ఉన్నారంటే కేవలం ప్రతిపక్ష నేతలని తిట్టడానికే అన్నట్లు ఉన్నారు. దీని వల్ల మంత్రులకే నెగిటివ్ అవుతుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే…కొందరు మంత్రులనే సంగతి ప్రజలకు తెలియకపోవడం. ఒకప్పుడు ఏ శాఖకు ఏ మంత్రి అంటే ప్రజలకు కాస్త తెలిసేది..కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదు. అసలు ఎవరు మంత్రి అనేది కూడా తెలియడం లేదు.

ఏదో కొంతమంది సీనియర్లు తప్ప మిగిలిన వారు మంత్రులనే తెలియడం లేదు. దీని వల్ల మంత్రులకు బాగా మైనస్ అవుతుంది. ఇంకా ఏదైనా భారమంతా జగన్ పైనే ఉన్నట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో మంత్రులకు గెలవడానికి కాస్త కష్టపడాలి అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్తితుల్లో ఉన్నప్పుడు చాలామంది మంత్రులు గట్టెక్కడం కష్టమనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news