ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీంతో చేరితే అధిక వడ్డీ బెనిఫిట్ పొందొచ్చు. స్కీమ్ టెన్యూర్, వడ్డీ రేటు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎస్‌బీఐ తాజాగా 400 రోజుల టెన్యూర్‌తో కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో చేరితే కస్టమర్లకు 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్కీమ్ పరిమిత కాలం వరకే ఉంటుంది. 2023 మార్చి 31 వరకే ఈ పథకం అందుబాటులో ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది.. తాజాగా వడ్డీ రేట్లను పెంచేసినట్లు తెలుస్తుంది.. ఎఫ్‌డీ రేట్లు 5 బేసిస్ పాయింట్ల నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెరిగాయి.. మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.25 శాతం నుంచి 6.5 శాతానికి ఎగసింది. రెగ్యులర్ కస్టమర్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.25 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగింది. ఇకపోతే ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్స్‌కు ఉయ్ కేర్ డిపాజిట్ పథాకాన్ని అందిస్తోంది.
అంతేకాదు 50బేసిస్ పాయింట్లను కూడా సొంతం చేసుకోవచ్చు.. హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లు పెరగనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి..ఆర్‌బీఐ రెపో రేటు పెంపు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. రెపో రేటు పెరగడం వల్ల బ్యాంకులు కూడా రుణ రేట్లు, ఎఫ్‌డీ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఎస్‌బీఐ కూడా ఈ బ్యాంకుల జాబితాలోకి చేరింది..