లవ్ లో ఫెయిల్ అయినవారికి గుడ్ న్యూస్..ఇన్సూరెన్స్ తో పాటు రూ.25,000 భీమా..

-

సాదారణంగా మనుషులకు, లేదా వాహనాలకు ఇన్సూరెన్స్ చెయ్యడం మనం చూసే ఉంటాం.. ఒక భరోసా కల్పించడానికి దీన్ని సదరు కంపెనీలు ఇవ్వడం లేదా తీసుకోవడం చేస్తారు.. కాని ప్రేమ విఫలమైనందుకు బీమా డబ్బులు పొందిన ఉదంతాన్ని ఎప్పుడైనా విన్నారా.. కనీసం అలాంటిది ఒకటి ఉందా అనేది కూడా చాలా మందికి తెలియదు..మీరు విన్నది అక్షరాల నిజం.. అలాంటి ఇన్సూరెన్స్ ఒకటి ఉంది..రూ.25 వేల భీమా కూడా ఉందని అంటున్నారు.. మరి ఆ ఇన్సూరెన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

love failure
love failure

ప్రేయసి తనను మోసం చేసినందుకు హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ కింద తనకు 25,000 రూపాయలు బీమా సొమ్ము అందినట్లు ప్రతీక్ ఆర్యన్ అనే భగ్నప్రేమికుడు ట్వీట్ చేశాడు. తాను, తన ప్రేయసి కలసి బ్యాంకులో జాయింట్ అకౌంట్ తెరిచామని, అందులో ప్రతినెల చెరో 500 రూపాయలు వేయడం ప్రారంభించామని ప్రతీక్ రాసుకొచ్చాడు. ఇందులో భాగంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామని, ఇద్దరిలో ఎవరైనా ప్రేమబంధాన్ని తెంచేసి వెళ్లిపోతే మోసపోయిన వ్యక్తికి బీమా సొమ్ము వచ్చే విధంగా తాము ఒప్పందం కూడా చేసుకున్నామని అతను తెలిపాడు..

తన ప్రేమ ప్రేయసి తనను మోసం చేసి వెళ్లిపోవడంతో హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ కింద రూ. 25,000 తనకు దక్కింందని అతను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 8 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించడమేగాక ప్రతీక్‌ను అభినందిస్తూ కామెంట్లు కూడా పోస్ట్ చేశారు. ఇక తన ప్రేయసి పోతు మంచి లాభన్ని కూడా ఇచ్చింది.. ఇక నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లను పోస్టు చేస్తున్నారు.. తాము కూడా ఇలాంటి ఇన్సూరెన్స్ ను ట్రై చేస్తామని చెబుతున్నారు.. మొత్తానికి ఇది వైరల్ గా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news