ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షలు – కేసీఆర్ ప్రకటన

-

సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామపంచాయతీకి పది లక్షల చొప్పున మంజూరు చేస్తున్నానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మహాబూబాబబాద్ మున్సిపాలిటీ 50కోట్లు, మిగతా మూడు మున్సిపాలిటీలకు 25 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. మతపిచ్చి కులపిచ్చి లేపి విద్వెషాలు రెచ్చగొడితే, తాలిబన్ల మాదిరిగా తెలంగాణ మారుతుందన్నారు సీఎం కేసీఆర్. మహబూబాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ ను ప్రారంభించారు సీఎం కేసిఆర్.

 

అనంతరం కలెక్టరేట్ ఆవరణలో స్థానిక ప్రజాప్రతినిధుల సభలో పాల్గొన్న సీఎం కేసిఆర్…షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్ల మనకు తీరని నష్టం వాటిల్లుతుంది…తలసరి ఆదాయం పడిపోయిందన్నారు. 14న్నర లక్షల కోట్లు ఉండాల్సిన మన తలసరి ఆదాయం 11 లక్షలు ఉంది..కేంద్ర అసమర్థతతో 3లక్షలు కోట్లు నష్టపోయామని ఫైర్ అయ్యారు.

 

తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తే మన ఆదాయం పెరిగేది…ప్రాజేక్టుల విషయంలో వివక్షత ఉందన్నారు. 20సంవత్సరాలు ట్రిబ్యునల్ తీర్పు లకే పోతుంది…పట్టుబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి మండువేసవిలో సాగు త్రాగు నీటికి ఇబ్బంది లేకుండా చేసుకున్నామని చెప్పారు. మతపిచ్చి కులపిచ్చి లేపి విద్వెషాలు రెచ్చగొడితే, తాలిబన్ల మాదిరిగా తెలంగాణ మారుతుందన్నారు సీఎం కేసీఆర్.దీనిపై చర్చ జరగాలి. ఈరోజు నుంచే ప్రతిచోట యువత మేధావులు చర్చ పెట్టాలని కోరారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version