తెలుగు రాష్ట్రాల మహిళలకు గుడ్ న్యూస్..నేడు మహిళలకు హాలిడే

-

తెలంగాణ మహిళలకు శుభవార్త చెప్పింది. మార్చి 8న అంటే ఇవాళ మహిళలకు హాలిడే ప్రకటించారు. అటు ఏపీలోనూ హాలీ డే ఇచ్చారు. కాగా ఇవాల్టి నుంచి ‘ఆరోగ్య మహిళ’ అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌ సర్కార్‌ అమలు చేయనుంది. మహిళా దినోత్సవం సందర్బంగా ప్రభుత్వం ఈ ‘ఆరోగ్య మహిళ’ అనే నూతన కార్యక్రమం చేపట్టనుంది.

 

సిపీఆర్ పై నిర్దేశిత వర్గాలకు శిక్షణ పూర్తి చేయాలని.. జిల్లా స్థాయి వైద్య, పంచాయితీ, మున్సిపల్, పోలీసు శాఖల సిబ్బంది పర్యవేక్షించాలని ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆదేశించారు.

 

ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని… కంటి వెలుగు మరింత ప్రభావవంతంగా నిర్వహించాలన్నారు. అన్ని కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు -ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్. అటు మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చేందుకు సిద్ధం అయింది కేసీఆర్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news