ఇప్పుడున్న పరిస్థితిలో డబ్బుల అవసరం అందరికి ఉంటుంది.. చాలా మందికి కరోనా కారణంగా ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు.అలాంటి వాళ్ళు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారు.కొన్ని బ్యాంక్ లు అధిక వడ్డీలు వెయ్యడం లేదా లోన్ కోసం ష్యురిటి సరిగ్గా లేదని రిజెక్ట్ చేస్తారు.ఒకవేళ అన్నీ ఒకే అయిన కూడా లోన్ రావడానికి చాలా సమయం తీసుకుంటుంది..అలా వెయిట్ చేయాల్సిన పని లేకుండా యూకో బ్యాంక్ రుణాలను అందిస్తున్నారు.
కస్టమర్ల సౌకర్యార్ధం యూకో బ్యాంకు సరికొత్తగా ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ (పీఏపీఎల్) అనే స్కీముని అమల్లోకి తెచ్చింది..అర్హులైన కస్టమర్లకు లోన్లు సుకరంగా శాంక్షన్ చేసి పంపిణీ చేయడమే దీని ఉద్దేశం. కస్టమర్లు బ్యాంకు బ్రాంచి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కేవలం కొద్ది నిమిషాల్లోనే లోన్ ప్రాసెసింగ్ చేస్తా రు. మొబైల్ ద్వారా లోన్ సొమ్ము బదిలీ చేస్తారు. యూకో కస్టమ ర్లు ఎవరైనా అర్జెంటుగా సొమ్ము అవసర పడితే 24 గంటల్లో ఎప్పుడైనా ఈ స్కీముని వినియోగించుకోవచ్చు.
ప్రీ క్లోజర్ చార్జీలుండవు. రుణాల మంజూ రులో 15 శాతం వృద్ధిని సాధించే లక్ష్యంతోను. అదే సమయంలో కొత్త తరం కస్టమర్లను ఆకర్షించే ఉద్దేశంతోను యూకో బ్యాంకు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి అడుగుపెట్టినట్టు బ్యాంకు ఓ వార్తా ప్రకటనలో పేర్కొంది..తమ ఈ లక్ష్యాన్ని పీఏపీఎల్ స్కీముతో మొదలుపెడుతున్నట్టు బ్యాంక్ ఉన్నతాధికారులు తెలిపారు.