సైబర్‌ వలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ..రూ. 2.25 లక్షలు మాయం

-

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోన ఒక మండలానికి చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి బుధవారం రాత్రి సెల్‌ఫోన్‌కు ‘ మీ బ్యాంకు ఖాతా నంబర్‌ బ్లాక్‌ చేయబడిందని మెసేజ్‌ వచ్చింది. ఈ మెసేజ్ ఒక అజ్ఞాత నెంబర్ నుండి వచ్చింది. ఆ వ్యక్తి కంగారు పడి మెసేజ్‌ పంపిన నంబర్‌కు ఫోన్‌ చేయగా, మొదట సీఐఎఫ్‌ నంబర్‌ చెబితే సరిపోతుందని తెలిపాడు. అనంతరం ఆధార్, ఏటీఎం కార్డు నంబర్లు కూడా అడగడంతో ఉపాధ్యాయుడు అవన్నీ యీ వ్యక్తికి చెప్పేశాడు. మరికొద్దిసేపటికి ఫోన్‌ చేసి మీ బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌కార్డు నంబర్‌ను లింక్‌ అప్‌డేట్‌ చేశానని, మధ్యమధ్యలో ఓటీపీలు వస్తాయని, చెప్పాలని అన్నాడు. అవి చెప్పిన వెంటనే కొద్ది సేపటికే ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా నుంచి మొదట రూ. లక్ష డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది.

Cyber Criminals | సైబర్‌ వలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ..బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి  రూ. 2.25 లక్షలు మాయం-Namasthe Telangana

దీంతో వెంటనే సైబర్‌ నేరగాడికి ఫోన్‌చేయగా ‘ మీ డబ్బులు తిరిగి రాత్రి 10 గంటలకు మీ బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతాయని’ ఉపాధ్యాయున్ని నేరగాడు నమ్మించాడు. ఆ తర్వాత మూడుసార్లు వరుసగా రూ.25వేలు, మరోసారి రూ.50వేలు, ఇంకోసారి రూ.50 వేలు డ్రా అయినట్లు ఉపాధ్యాయుడి సెల్‌ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌లు వచ్చాయి. మొత్తం రూ.2.25 లక్షలు ఆ నేరగాడు దోచేశాడు. తాను మోసపోయినట్లు గమనించిన ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని కుమారుడికి తెలుపగా వెంటనే రాత్రే సైబర్‌ క్రైం విభాగ సైట్‌కు కంప్లైంట్ చేశారు. ఈరోజు ఉదయం సైబర్‌ క్రైం టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు ఇటీవల బీటెక్‌ పూర్తి చేయగా అతడిని విదేశాలకు పంపేందుకు అవసరమైన బ్యాంకు బ్యాలెన్స్‌ కోసం డబ్బులను అకౌంట్‌లో ఉంచుకున్నాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news