మేకపాటికి వైసీపీ నేతల వార్నింగ్…ఉదయగిరికి వస్తే తరిమికొడతాం

-

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి పార్టీ నేతలకు సవాల్ చేసారు. ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ ఆయనకు వైసీపీ నేతలు హెచ్చరికలు చేసిన సంగతి ఎలిసిందే, అయితే ఈ నేపధ్యం లో, ఆయన ఉదయగిరికి వచ్చారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చొని కూర్చున్నారు. ఎవరైతే తనను తరిమి కొడతానన్న వాళ్లు రావాలంటూ సవాల్ విసిరారు . ఈ సందర్భంగా ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు కూడా అక్కడకు వచ్చారు. ఈ సందర్భం లో అక్కడ కాస్త హడావిడి జరిగింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేయడానికి చూశారు.

Mekapati Challenge to YSRCP leaders in Udayagiri

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి, టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారంటూ ఆయనను వైసీపీ పార్టీ నుండి తొలగించారు. దీంతో, అప్పటి నుంచి వైసీపీ వర్గీయులు ఆయనను టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఉదయగిరికి వస్తే తరిమికొడతామని వైసీపీ నేతలు మేకపాటికి హెచ్చరింపులు జారీ చేశారు. ఈరోజు ఉదయం కూడా ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెళ్లిపో అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేపట్టాయి. ఈ విషయం తెలుసుకుని మర్రిపాడు నుంచి ఉదయగిరికి చేరుకుని మీడియా సమావేశాన్ని నిర్వహించారు మేకపాటి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తనపై అభాండాలు వేసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రజల అండతోనే తాను ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని అన్నారు ఆయన. తనను తరిమికొడతాన్న వారు ఎవరొస్తారో రావాలని సవాల్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news