తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్స్, కాలేజీ విద్యార్థినులకు సానిటరీ కిట్ల పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో పంపిణీకి సర్కారు చర్యలు తీసుకోనుంది. దీంతో 8 నుంచి 12వ తరగతి విద్యార్థునులు లబ్ధిపొందనున్నారు.
ఇక ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.69.52 కోట్లు ఖర్చు చేయనుంది కేసీఆర్ ప్రభుత్వం. అలాగే.. మొత్తం 33 లక్షల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రణాళిక చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే కొనుగోలు, పంపిణీ కోసం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం.