రిపబ్లిక్ డే వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం చెప్పిన సాకు నవ్వు తెప్పిస్తుందన్నారు గవర్నర్ తమిళిసై. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం పై చేసిన ఆరోపణలు పుదుచ్చేరి గణతంత్ర వేడుకలలోనూ చేశారు తమిళి సై. పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలు జరపక పోవడానికి ప్రభుత్వం చెప్పిన కరోనా సాకు నవ్వు తెప్పిస్తుందన్నారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు, కెసిఆర్ ప్రభుత్వం పై కేంద్రానికి నివేదిక ఇచ్చానని తెలిపారు.
ఖమ్మంలో కేసీఆర్ ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టారని, అప్పుడు ఆ సభకి లేని కరోనా రిపబ్లిక్ డే కి మాత్రమే గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. గత రెండు సంవత్సరాల నుంచి రాజ్ భవన్ పై ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.