వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లులు చేసుకోండి : గవర్నర్‌ తమిళిసై

-

తెలంగాణ గవర్నర్‌ తమిళపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ‘‘నేను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే వివాహం చేసుకున్నా.. మీరు కూడా వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లులు చేసుకోండి, చదువు అయిపోయేంత వరకు ఆగొద్దు’’.. అంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రాష్ట్రంలోనే తొలిసారి అధునాతన సింథటిక్ క్యాడవర్‌తో కూడిన స్కిల్‌ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్ ఏర్పాటు చేశారు. అయితే.. గవర్నర్ తమిళిసై నిన్న దీనిని ప్రారంభించారు. అలాగే, ఆపరేషన్ స్వస్త, అనుసంధాన్ పత్రికతలను ఆవిష్కరించారు.

Prestigious honour for Governor Dr Tamilisai Soundararajan

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నపుడే తనకు వివాహమైందని, అయినప్పటికీ అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులతో పాసైనట్టు గుర్తు చేసుకున్నారు. కాబట్టి వయసులో ఉండగానే వివాహం చేసుకోవాలని వైద్య విద్యార్థులకు సూచించారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎయిమ్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news