ప్రియాంక గాంధీకి షాకిచ్చిన కేంద్రం.!

-

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఢిల్లీలో లోథీ రోడ్‌ లో ఆమె ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ ఆమెకు స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఆమెకు లేఖ రాసింది. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున 35, లోథీ ఎస్టేట్స్‌ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కోరింది. ఆగస్టు 1లోగా బంగ్లా ఖాళీ చేయాలని స్పష్టం చేసింది.

అంతకంటే ముందు చెల్లించాల్సిన రూ. 3.46 లక్షల మొత్తాన్ని చెల్లించాలని తేల్చి చెప్పింది. జూన్ 30, 2020 నాటికి ప్రియాంక గాంధీ రూ. 3,44,677 చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. బంగ్లా ఖాళీ చేయడానికి ముందే ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేశారు. తాజాగా ఆమెకి ఎస్‌పీజీ భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం ఆమె భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి తగ్గించింది.

Read more RELATED
Recommended to you

Latest news