చిన్నపిల్లలపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయి. 2-17 సంవత్సరాల వయసు వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్, జైడస్ క్యాడిల్లా జైకోవ్ డి వ్యాక్సిన్లకి పిల్లలపై ట్రయల్స్ నిర్వహించడానికొ అనుమతులు లభించాయి. తాజాగా సీరం ఇన్స్టిట్యూట్ కోవొవ్యాక్స్ పేరుతో పిల్లల కోసం వ్యాక్సిన్ తీసుకు వస్తుంది. ఈ మేరకు ట్రయల్స్ నిర్వహించడానికి డీసీజీఐ అనుమతి కోరింది. మొత్తం 920మంది పిల్లల్లో 460మంది 12-17 సంవత్సరాల వయసు గల వారు ఉన్నారు.
ఐతే సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, పిల్లలపై ట్రయల్స్ కు అనుమతి ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఏ దేశం కూడా కోవోవ్యాక్స్ కి అనుమతి ఇవ్వకపోవడమే దానికి కారణం అని తెలుస్తుంది. కోవొవ్యాక్స్ సామర్థ్యం డ్రగ్ కంట్రోల్ బోర్డు ముందు ఉంచినప్పటికీ అనుమతులు ఇవ్వలేదు. మరి కొన్ని రోజులు పోయాక అనుమతులు లభిస్తాయా లేదా అన్నది చూడాలి.