Big Announcement : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-4 పోస్టు భర్తీకి అనుమతి

-

తెలంగాణలోని గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే.. ఈ పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే 503 గ్రూప్‌ 1 పోస్టులకు ప్రిలిమ్స్‌ పరీక్షలను పూర్తిచేసింది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆన్సర్‌ కీ కూడా విడుదల చేసింది. ఇక గ్రూప్‌ -2 కింద 663 పోస్టులకు, గ్రూప్‌-3 కింద 1373 పోస్టులకు, గ్రూప్‌-4 కింద 1298 పోస్టులకు అనుమతి కూడా తెల్పింది.

Sri K. Chandrashekar Rao

టీఎస్పీయస్సీ ద్వారా త్వరలో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాల్లో మరికొన్నింటిని అదనంగా చేర్చుతూ గురువారం (నవంబర్‌ 24) రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌ 2, 3, 4 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను జనరల్ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సవరించింది. గ్రూప్‌-2లో మరో ఆరు రకాల పోస్టులు, గ్రూప్‌-3లో రెండు పోస్టులు, గ్రూప్‌-4లో మరో నాలుగు రకాల పోస్టులను చేర్చుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news