గుడివాడ అమర్నాధ్ కి గుడ్లు తో అభిషేకం చేస్తున్న విద్యార్థులు..!

-

ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీట్ ఎక్కాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తెలుగు విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమర్నాథ్ పోస్టర్ పై గుడ్లు కొట్టారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు మాట్లాడుతూ అమర్నాథ్ మీద సంచలన కామెంట్స్ చేశారు.

టీడీపీ లో రాజకీయ ఓనమాలు నేర్చుకుని ఈ రోజు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై లోకేష్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే 2024లో నీ గుడ్డు మిగులుతుందని హెచ్చరించారు. 24 గంటల్లో ఐటీ శాఖ మంత్రిగా మీరు తీసుకువచ్చిన కంపెనీల దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగి వాట్సాప్ చేయగలరా అని అన్నారు. లోకేష్ పైన ఇష్టానుసారంగా మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version