అమరావతి కోసం చంద్రబాబు రాజీనామా చేసి, గెలవాలని సవాల్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ డబ్బా పెరుగన్నం తిని డబ్బాల్లో డబ్బులు సర్దుకుని ఏమి చేశాడో అందరూ చూసారని.. Iyr బుక్ రిలీజ్ లో పవన్ ఏమి మాట్లాడాడో అందరూ విన్నారని తెలిపారు. విశాఖ గర్జన పెద్ద యెత్తున జరగబోతుంది.. దానితో అయినా కళ్ళు తెరవాలని పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడు రాజీనామా చెయ్యాలి.. అమరావతీ కావాలి అంటే రాజీనామా చెయ్యాలని ఛాలెంజ్ చ ఏశారు. లేదంటే కుప్పంలో చంద్రబాబు రాజీనామా చెయ్యాలని.. మాకు ప్రజలు ఐదేళ్లు సమయం ఇచ్చారు.. వచ్చే ఎన్నికల్లో కూడా మాదే విజయమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మేము ప్రజల వద్ద తెల్చుకుంటామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రా ప్రజలు అచ్చెన్నాయుడును చూసి భయపడుతున్నారని.. విశాఖలో టీడీపీ నేతల కబ్జాల్లో 400 ఏకరాల భూములు కాపాడిన ప్రభుత్వం మాదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.