జగిత్యాల వాసి.. సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌కు అరుదైన గౌరవం లభించింది. అతి చిన్న సైజులో ఎలుకల బోను నమూనాను తయారు చేసి రికార్డు సృష్టించారు. దీంతో ఆయన పేరు గిన్నిస్ బుక్‌లో ఎక్కింది. ఈ ఎలుకల బోను 5 మిల్లీమీటర్ల పొడవు, 2.5 మిల్లీమీటర్ల వెడల్పు ఉంటుంది. 29 నిమిషాల్లో ఎలుకల బోను నమూనాను రూపొందించాడు. అయితే, అయిదేళ్ల క్రితం ఓ భారతీయుడు గంటలో సూక్ష్మ బోనును తయారు చేయగా.. ఆ రికార్డును దయాకర్ బ్రేక్ చేశాడు. గతేడాది డిసెంబర్ 2వ తేదీన అధికారుల సమక్షంలో ఎలుకల బోనును తయారు చేసి పంపగా.. తాజాగా దయాకర్‌కు గిన్నిస్ రికార్డు వరించింది.
కాగా, గతంలోను ఎన్నో సార్లు గుర్రం దయాకర్ వార్తల్లోకి ఎక్కారు. అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేసి అందరినీ ఔరా అనిపించాడు. మాతృ దినోత్సవ సందర్భంగా గుండు పిన్నుపై ఇమిడేలా తల్లి తన బిడ్డను మోకాలుపై ఆడిస్తున్నట్లుగా ఓ కళాఖండాన్ని రూపొందించాడు. గుండు పిన్నుపై విగ్రహాన్ని రూపొందించడానికి తనకు 8 గంటల సమయం పట్టింది.