క్రికెట్ అభిమానుల్ని రెండు నెలల పాటు ఉర్రూతలూగించిన ipl-2022 సీజన్ నేటితో ముగియనున్నది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 8 గంటలకి ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే రాజస్థాన్ టీం ఒకసారి టైటిల్ గెలవగా.. గుజరాత్ టైటాన్స్ టీం కి ఇదే మొదటి ఐపీఎల్ సీజన్.
దీంతో రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ టైటిల్ గెలిచేనా? లేదా కొత్త విజేతగా గుజరాత్ టైటాన్స్ అవతరించేనా? అనే చర్చ సర్వత్రా కొనసాగుతోంది. లీగ్ దశలో 14 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ టైటాన్స్ టీం ఏకంగా 10 మ్యాచుల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టిక లో నెంబర్ వన్ స్థానం తో ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా ఆడిన 14 మ్యాచ్ లకిగానూ..9 మ్యాచుల్లో గెలుపొందింది. అయితే ఐపీఎల్ 2022 ఈ సీజన్లో రెండు సార్లు ఈ జట్లు తలపడగా.. రెండింటిలోనూ గుజరాత్ టైటాన్స్ టీం ఆధిపత్యం చెలాయించడం గమనార్హం.