తీరానికి పాతిక కిలోమీటర్ల దూరంలోనే పెనుతుఫాన్

-

పెను తుఫాన్ మరో తీరానికి మరో 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మరో 3 గంటల్లో తీరం దాటే ప్రక్రియ పూర్తి కానుందని తెలిపింది. కళింగపట్నానికి గోపాలపూర్ కు సమీపంలో తీరం దాటనున్నట్లు హెచ్చరిక. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిషా ప్రభుత్వాలు సహాయక చర్యల కోసం అన్ని ఏర్పాట్లను చేసుకుంది. ముఖ్యంగా ఒడిషా ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కోబోతోందని వాతావరణ హెచ్చరికలు చేసింది.  ఆ తర్వాత ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణ, చత్తీస్గడ్ రాష్ట్రాలు అధిక ప్రభావానికి గురికానున్నాయి. తాజాగా రెడ్ అలర్ట్ జాబితాలో ఒడిషా, ఏపీలతో పాటు తెలంగాణను కూడా చేర్చారు. రానున్న రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ తీవ్రతపై ప్రధాని మోడీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఫొన్లో సంభాషించారు. కేంద్రం అండగా ఉంటుందని అన్ని విధాలుగా సహాయసహకారాలను అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ బ్రుందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరింది. ఏపీలో రక్షణ చర్యల కోసం 8 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ బ్రుందాలను కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news