కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్న పద్మభూషణ్ పురస్కారం..

-

కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు సద్దుమనిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలువురు నేతలు వరసగా కాంగ్రెస్ పార్టీని వదిలివెళుతున్నారు. సీనియర్లు గ్రూప్ 23 గా ఏర్పడి సోనియా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్రం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారం కాంగ్రెస్ పార్టీలో మంటలు రాజేస్తోంది. నిన్న కేంద్రం కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అయితే ఇదే అంశం ప్రస్తుతం కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది.

ఆజాద్ కు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించడంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గులాంనబీ ఆజాద్ కు పురస్కారం ప్రకటించడంపై కపిల్ సిబల్ స్వాగతించారు. కాగా మరో సీనియర్ నేత జైరాం రమేష్ మాత్రం దీనిపై సెటైర్లు వేశారు. పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించడంపై వ్యాఖ్యానించారు. ఆయన ఆజాద్ లా ఉండాలనుకుంటున్నారు.. గులాంలా కాదు అంటూ ట్విట్ చేశారు. ఇది గులాంనబీ ఆజాద్ ను ఉద్దేశించి సెటైర్ వేసినట్లుగా ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version