దేవుడి పాటకు ఒసే రాములమ్మ స్టెప్ వేసిన గున్న ఏనుగు..వీడియో వైరల్..

-

సోషల్ మీడియాలో క్రేజీగా ఉండే ఏ వీడియో అయినా..తెగ వైరల్ అవుతుంది. ఎంతో మందిని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత సోషల్ మీడియాకు ఉంది. మొన్నటిమొన్న కచ్చాబాదం సాంగ్ నెటిజన్లను ఓ ఊపు ఉపింది..ఇంకా ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ అయితే..చిన్నపిల్లవి భలే ముద్దుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా కుక్కపిల్లలు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు చూశారా..అవి ఇంకా మస్త్ ఉంటాయి. మొన్న ఓ కుక్క తన యజమానికి భలే బుద్ది చెప్పింది. తల్లి ఇచ్చిన ఆహారం వద్దన కిందేసిన అతన్నికి రెండు తగిలించింది కుక్కు..దెబ్బకి అది తీసుకునే ప్లేట్ లో వేసుకుని తిన్నాడు అతను. ఆ‌ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అయితే..ఓ ఏనుగు దేవుడు పాటకు హీరో రేంజ్ లో స్టెప్ లు వేసింది. ఆ ఏనుగు అలా స్టెప్ లు వేస్తుంటే..అక్కడివారు ఎంతో ఉత్సహాంగా తిలకించారు..
ఓ గున్న ఏనుగు.. దేవుడి పాటకు వీర లెవల్లో స్టెప్ లు వేసింది.. అయితే ఆ ఏనుగు పిల్ల రోడ్డుకి అడ్డంగా నిలుచుని ఎంతో వయ్యారంగా డ్యాన్స్ చేస్తూంటే.. పక్కన ఉన్న మావటి.. తన చేతిలోని కర్రతో గున్న ఏనుగుకి సిగ్నల్ ఇచ్చాడు. అంతే ఎదో అర్ధమయినట్లు… ఆ గున్న ఏనుగులు రోడ్డుకి నిలువుగా తిరిగి.. పాటకి అనుగుణంగా కాళ్ళను లయబద్దంగా కదుపుతూ.. మనిషి చేసినట్లు ఎంతో అందంగా డ్యాన్స్ చేసింది. శ్రీముకి ఒసే రాములమ్మ స్టెప్ గుర్తుకువస్తుంది..ఆ స్టెప్ చూడగానే.. అయితే ఈ గున్న ఏనుగు ఎప్పుడు ఏ సందర్భంలో డ్యాన్స్ చేసిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు అంతా ఆ ఏనుగును పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఏనుగు డ్యాన్స్ వేసిన ఫుల్ వీడియో ఉంటే అప్ లోడ్ చేయమని అడుగుతుంటే..మరికొందరు చిత్రం భళారే చిత్రం అంటూ కమెంట్ చేస్తున్నారు.. మీరు కూడా ఆ ఏనుగు డ్యాన్స్ పై ఓ లుక్ వేయండి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news