శివలింగం అంటే తమాషా కాదు… జ్ఞానవాపి కేసుపై కాంగ్రెస్ నేత

-

దేశవ్యాప్తంగా ప్రస్తుతం వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారం సంచలనంగా మారింది. మసీదు వీడియో సర్వేలో కొలనులో శివలింగం బయటపడింది. ప్రస్తుతం ఈ కేసు వారణాసి జిల్లా కోర్ట్ పరిధిలో ఉంది. సుప్రీం కోర్ట్ ఇటీవల ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఇదిలా ఉంటే మసీదులోని కొలనులో నుంచి బయటపడిన శివలింగ రూపాన్ని రక్షించాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే కొన్ని పార్టీల నాయకులు మాత్రం ఇది కావాలని బీజేపీ చేస్తున్న నాటకం అని… ప్రజల మధ్య విభజన తీసుకురావడానికే శివలింగం దొరికిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేశారు. శివలింగం అంటే తమాషా కాదని ఆయన అన్నారు. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కానీ శివలింగాన్ని తమాషాగా పిలువ లేము అంటూ వ్యాఖ్యానించారు. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం అని ఆయన  అన్నారు. మా పార్టీ ( కాంగ్రెస్) పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తమను తాము మరింత ఉదారవాదులుగా చూపించుకునే ప్రయత్నంలో ‘ శివలింగాన్ని’ ఎగతాళి చేస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ‘సర్వధర్మ సంభవ’ సిద్ధాంతంపై పనిచేస్తుంది. మేము మహాత్మా గాంధీ అనుచరులం అని ఆయన అన్నారు. మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా శివభక్తుడని ఆయన అన్నారు. సనాతన ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని కానీ సొంత మతాన్ని అవమానించడాన్ని అనుమతించదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news