భారత అథ్లెటిక్ కోచ్‌గా హనుమకొండ వాసి

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో కామన్‌వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ  ప్రతిష్టాత్మక క్రీడలో వరంగల్ హనుమకొండ వాసికి అద్భుత అవకాశం దొరికింది. హనుమకొండలోని కాపువాడకు చెందిన వరల్డ్ ఫిట్‌నెస్ ట్రైనర్, అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేశ్‌కు కామన్‌వెల్త్ క్రీడల్లో భారత అథ్లెటిక్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) కార్యదర్శి రవీందర్ చౌదరి ప్రకటన విడుదల చేశారు.

అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేశ్‌
అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేశ్‌

కాగా, నేటి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు కామన్‌వెల్త్ క్రీడలు జరగనున్నాయి. నాగపురి రమేశ్ పర్యవేక్షణలో భారత స్టార్ అథ్లెట్ ద్యుతిచంద్‌కు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ద్యుతిచంద్ 400 మీటర్ల విభాగంలో పాల్గొననుంది. కాగా, ప్రస్తుతం రమేశ్ హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.18వ కామన్‌వెల్త్ క్రీడల్లో ఈ సారి భారీ పోటీ నెలకోనుంది. భారత అథ్లెట్లు కూడా పతకాల వేట కోసం ఎదురు చూస్తున్నారు.