జోగిని శ్యామలకు వేధింపులు..అసభ్యకరమైన ఫోటోలు పంపి మరీ !

-

జోగిని శ్యామల.. ఈ పేరు తెలియని వారుండరు. ఎప్పుడు హైదరాబాద్‌ లో బోనాల పండుగ జరిగినా… జోగిని శ్యామల దర్శనమిస్తారు. అయితే.. తాజాగా జోగిని శ్యామలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ మహిళ.. జోగిని శ్యామలకు చెందిన అసభ్యకరమైన వీడియోలు పంపి.. టార్చర్‌ కు గురిచేసింది. దీంతో జోగిని శ్యామల.. తాజాగా సిటీ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే…బంజారాహిల్స్‌ కు చెందిన మౌనిక… జోగిని శ్యామలకు మంచి స్నేహితురాలు. వీరిద్దరూ చాలా క్లోజ్‌ గా ఉండేవారు. అయితే.. భర్తతో గొడవ పడి..జోగిని శ్యామల వద్దకు మౌనిక వచ్చింది. అయితే.. ఈ విషయంలో… మౌనిక భర్తకు మద్దతుగా నిలిచింది జోగిని శ్యామల. దీంతో ఆగ్రహానికి గురైన మౌనిక… శ్యామల ఇంటి ముందు రచ్చ చేసింది. అక్కడితో ఆగకుండా.. జోగిని శ్యామలకు చెందిన వ్యక్తిగత వీడియోలు ఆమెకు పంపుతూ.. టార్చర్‌ పెట్టింది మౌనిక. దీంతో సిటీ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది జోగిని శ్యామల.

Read more RELATED
Recommended to you

Exit mobile version