బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న హార్దిక్ పటేల్… జూన్ 2న ముహూర్తం

-

కాంగ్రెస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పిన గుజరాత్ యువనేత, పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ బీజేపీలో చేరుతున్నట్లు కన్ఫామ్ చేశారు. ఇటీవల తనకు పార్టీలో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన జూన్ 2న కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఏఎన్ఐకి చెప్పారు. దీంతో రానున్న గుజరాత్ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హర్దిక్ పటేల్ పార్టీని వదలడం కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బగా చెప్పవచ్చు.

hardik-patel

ఇటీవల గుజరాత్ లో బీజేపీ రెండు రోజుల పాటు అమిత్ షా సారథ్యంలో చింతన్ శిబిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజరాత్ కు చెందిన కీలక నేతలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హర్దిక్ పటేల్ తో పాటు మరో కాంగ్రెస్ నేత బీజేపీలో చేరే అంశంపై చర్చించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత హర్దిక్ పటేల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీరాముడితో కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రాబ్లం అంటూనే.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. దీంతో అప్పటి నుంచే హార్దిక్ బీజేపీలో చేరుతారనే స్పష్టమైన సిగ్నల్స్ పంపాడు.

Read more RELATED
Recommended to you

Latest news