ట్రెండ్ ఇన్: పవర్ స్టార్ నయా లుక్.. ‘హరిహర వీరమల్లు’తో పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే..

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన చిత్ర అప్ డేట్స్ తెలుసుకునేందుకు అశేష అభిమాన లోకం ఈగర్ గా వెయిట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ అండ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది.

శుక్రవారం నుంచి జనసేనాని ‘హరిహర వీరమల్లు’ పిక్చర్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం పవన్ ..టోడొర్ టాజరోవ్ అనే కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో యాక్షన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా విడుదల చేయగా, అవి నెట్టింట వైరలవుతున్నాయి.

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ అభిమానులు జయహో పవన్ కల్యాణ్ అని ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు. #HariHaraVeeraMallu హరిహర వీరమల్లు హ్యాష్ ట్యాగ్ ను ట్వీట్ చేసేశారు. అలా సదరు హ్యాష్ ట్యాగ్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది.

#Pawan Kalyan హ్యాష్ ట్యాగ్ నూ పవన్ అభిమానులు ట్వీట్ చేస్తూనే ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ కు జోడీగా అందాల ‘నిధి’ అగర్వాల్ నటిస్తోంది. కీలక పాత్రల్లో అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కోట శ్రీనివాసరావు తదితరులు నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా పిక్చర్ రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version