కేసీఆర్ వ్యూహానికి విపక్షాలు కకావికలం : హరీశ్‌ రావు

-

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి సీఎం కేసీఆర్ కు గిప్ట్ గా ఇస్తామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి క్యాడర్ లేదని, కాంగ్రెస్ కు క్యాండిడేట్లు లేరని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ వ్యూహాలకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రేపు మెదక్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడారు. మెదక్ వేదికగా రేపు సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావం పూరిస్తారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటి సభ నూతన ఉత్సాహంతో సభ జరుగనుందని పేర్కొన్నారు.

కేసీఆర్ వ్యూహాన్ని ఎవరూ ఊహించలేదు. ఎమ్మెల్యే అభ్యుర్థుల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయి. మెదక్‌లో పదికి పది సీట్లు పక్కా గెలిచి సీఎం కేసీఆర్‌కు గెలుపు బహుమతిగా ఇస్తామని స్పష్టం చేశారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా, వారిని ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. టేకేదార్లకు కూడా పింఛను ఇచ్చే కార్యక్రమం సీఎం కేసీఆర్ మెదక్ వేదికగా ప్రారంభిస్తారు. అలాగే దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్లు కూడా అందిస్తారని, అనంతరం మధ్యాహ్నం 3గంటల బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు.

బీఆర్ఎస్ పాలనలో మెదక్ రూపు రేఖలు మారాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఓకే సారి ఇంత పెద్ద మొత్తంలో సీట్లు ప్రకటించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్లకు లీడర్లు లేరు, బీజేపీ వాళ్లకు కేడర్ లేదు. యువత, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు బీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున జై కొడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు.

తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదని చెప్పారు. కుల వృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా కేంద్రం కాపీ కొట్టిందని గుర్తు చేశారు. మనం పూర్తిగా ఉచితంగా లక్ష రూపాయలు అందిస్తే, కేంద్రం లోన్ల రూపంలో ఇస్తుందట. బీఆర్‌ఎస్‌కు బీజేపీకి ఉన్న తేడా ఇదేనన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version