మహారాష్ట్ర రైతులు తెలంగాణలో భూములు కొంటున్నారు : హరీష్ రావు

-

మహారాష్ట్ర రైతులు తెలంగాణ సరిహద్దుల్లో భూములు విపరీతంగా కొనుగోలు చేసి.. అక్కన్నుంచి సాగునీటిని మహారాష్ట్రలోని తమ భూములకు తరలిస్తున్నారని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ఎన్సాన్‌ పల్లిలో పర్యటించిన ఆయన… పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. ఇక ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని. కేంద్రం ఎఫ్ సి ఐ ద్వారా పంట కొనుగోలు చేయాలని రాజ్యాంగంలోనే ఉందని చెప్పారు.

గతంలో చాలా మంది ప్రదానులుగా చేసిన వారు వడ్లు కొనుగోలు చేశారని.. మొట్టమొదటి సారి మోడీ ప్రభుత్వం వడ్లు కొనమని మొండికేస్తుందని నిప్పులు చెరిగారు. పంజాబ్ లో వడ్లు కోని తెలంగాణ లో ఎందుకు కొనడం లేదని మన ఎంపీ లు ఢిల్లీలో కొట్లాడుతున్నారని… పంజాబ్ కి ఒక న్యాయం.. తెలంగాణ కు ఒక న్యాయమా ? అని నిలదీశారు.

మద్దతు ధర వడ్ల కు ఇచ్చి బియ్యం కొంట అంటే ఎలా ? బిజెపి రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చిందని.. బిజెపి పాలించే ఏ రాష్ట్రంలో కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని ఫైర్‌ అయ్యారు. ఆయిల్ ఫామ్ కోసం బడ్జెట్ లో వెయ్యి కోట్లు పెట్టామని..బిజెపి ఎన్నికల ముందు ధరలు తగ్గించి, ఎన్నికలు కాగానే ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్‌రావు.

Read more RELATED
Recommended to you

Latest news