బ్రేకింగ్‌ : కిడ్నాప్‌ చేసిన మాజీ సర్పంచ్‌ను హత్య చేసిన మావోయిస్టులు

నిన్న‌టి రోజున ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చెందిన కుర్సం రమేష్ మావోయిస్ట్ లు కిడ్నాప్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. నిన్న కిడ్నాప్ చేసిని మాజీ స‌ర్పంచ్ రమేష్ ను హ‌త్య చేశారు మావోయిస్టులు. మావోయిస్టుల‌ను మోసం చేసేలా వ్య‌వ‌హ‌రించాడ‌ని.. అందుకే ర‌మేష్ ను చంపిన‌ట్లు మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ మేర‌కు మాజీ స‌ర్పంచ్ రమేష్ ను హ‌త్య చేసిన‌ట్లు లేఖ విడుద‌ల చేశారు మావోయిస్టులు.

త‌మ స‌మాచారం… పోలీసుల‌కు ర‌మేష్ అందించార‌ని.. మావోయిస్ట్ పార్టీ తీరని ద్రోహం చేశార‌ని మావోలు లేఖ లో పేర్కొన్నారు. అందుకే తాము ర‌మేష్ ను హ‌త్య , చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు మావోలు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌రిగితే.. వారిని కూడా శిక్షిస్తామ‌ని హెచ్చ‌రించారు. కాగా.. వృత్తి రీత్యా రమేష్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అలాగే.. రమేష్ భార్య రజిత ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ఎన్ ఎం గా పని విధులు నిర్వహిస్తుంది. ర‌మేష్ మృతి తో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.