హరీష్ రావు కీలక సమీక్ష… కొత్త వేరియంట్, థర్డ్ వేవ్ పై అప్రమత్తం.

-

ప్రపంచంతో కరోనా వ్యాధి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. యూరప్, రష్యా, ఆఫ్రికా దేశాల్లో కరోనా తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా ఆదేశాలు కలవరపడుతున్నాయి. అయితే ఇండియాలో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నా… ముప్పు పొంచే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పై ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. కేంద్రం కూడా కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉంది. దీనిపై నేడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం ఇప్పటికే హెచ్చిరించింది. ముఖ్యంగా సౌతాఫ్రికా దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్రం.

తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కూడా కీలక సమీక్ష ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొత్త వేరియంట్ పై ప్రధానంగా ద్రుష్టి సారించే అవకాశం ఉంది. దీంతో పాటు థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో హరీష్ రావు చర్చించనున్నారు. ప్రజారోగ్య పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తపై అధికారులకు దిశానిర్ధేశం చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మరింత వేగం పెంచేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news