కరోనాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ చాలా ప్రమాధకరంగా ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక డబ్ల్యూహెచ్ వో కూడా ఈ వేరియంట్ ను ఆందళనకర వేరియంట్ అంటూ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే అప్రమత్తం అయ్యింది. ఆ దేశం నుండి వస్తున్న విమానాలపై ఆంక్షలు విధించింది.
ఇదిలా ఉండగా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తాజాగా ఈ పరిస్థితి పై స్పందించారు. దక్షిణాఫ్రికా, బోట్స్ వానా దేశాల్లో B.1.1529 అనే కరోనా రకాన్ని గుర్తించినట్టు WHO వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.యూరప్ లోని పలు ఎయిర్ లైన్స్ ఆ దేశాలకు సర్వీసులు నిలిపేశాయి. టీకాలు తీసుకోకుండా ఉదాసీనత కనబరుస్తున్నవారు తక్షణం అప్రమత్తం కావాలి. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. అంటూ విజయ సాయిరెడ్డి ప్రజలకు చూచించారు.