ఢిల్లీలో బీఆర్ఎస్, కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్

-

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్ముక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.ఢిల్లీలో బీఆర్ఎస్, కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ..మెదక్‌లో బీజేపీని బీఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదని విమర్శించారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బీఆర్ఎస్ మెజారిటీ సాధించిందని అన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ మెజారిటీ సాధించిందని తెలిపారు.

.

సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది.. మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అక్కడ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా అని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్‌ పార్లమెంట్‌లో బీజేపీ ఎలా గెలిచిందని అన్నారు.మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరీ వారంతా కలిసి బీజేపీని గెలిపించారా అని ప్రశ్నించారు. కొడంగల్ అసెంబ్లీ నుండి రేవంత్ రెడ్డి 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని, మరీ లోక్ సభ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజారిటీ మాత్రమే వచ్చిందని, మిగతా ఓట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీకి వేయించారా..? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో బీజేపీ భారీ మెజారిటీతో ఎలా గెలిచిందని, ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించిందా..? అని హరీష్ రావు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version