పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. త్వరలో ఆయనతో ‘భవదీయుడు భగత్ సింగ్ ’ పిక్చర్ చేయనున్నారు. ఈ సినిమా కోసం పవన్ అశేష అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా హరీశ్ శంకర్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వి్ట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.
‘మై ఎవర్ గ్రీన్ ఫేవరెంట్ షాట్స్’ అనే క్యాప్షన్ తో పవన్ కల్యాణ్ ఫొటలోను హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. సదరు ఫొటోల్లో పవన్ కల్యాణ్ చాలా స్టైలిష్ గా కనబడుతున్నారు. బ్లాక్ , వైట్ కలర్ సూట్ లో అలా స్టైలిష్ లుక్ లో కనబడుతున్నాడు. ఈ రెండు ఫొటోలు కూడా సూపర్ హిట్ ఫిల్మ్ ‘తమ్ముడు’ చిత్రంలోనివి.
‘మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా’ అన్న పాటలో పవన్ కల్యాణ్ స్టిల్స్ ఇవి. కాగా, ఇటువంటి ఎనర్జిటిక్ అండ్ స్టైలిష్ షాట్స్ ను ‘భవదీయుడు భగత్ సింగ్’లో రీక్రియేట్ చేయాలని నెటిజన్లు, పవన్ కల్యాణ్ అభిమానులు హరీ శ్ శంకర్ ను కోరుతున్నారు. సేమ్ ఎనర్జీ రిపీట్ చేయాలని అడుగుతున్నారు. ఈ సారి ‘గబ్బర్ సింగ్’ ను మించిన సినిమా ఉండాలని అంటున్నారు. స్టూడెంట్ లీడర్ గా పవన్ కల్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ..అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండూ ప్యారలల్ గా చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ పూర్తి కాగానే ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయనున్నారు జనసేనాని.
Recreate this energy again @harish2you 🙏🙏🙏#BhavadeeyuduBhagatSingh | @PawanKalyan pic.twitter.com/CyG7ZIOfKv
— Ram👑💫 (@Rampavan_jaanu) August 6, 2022
My Evergreen favt shots !!!! pic.twitter.com/LwcWeP6Ory
— Harish Shankar .S (@harish2you) August 6, 2022