వెల్లుల్లి మొలకెత్తిందా? పాడైందనుకుని పారేస్తారా ఏంటి.. ఇందులోనే లాభాలు ఎక్కువ..!

-

వెల్లుల్లి వంటల్లో తనదైన రుచిని అందిస్తుంది. తాలింపుల్లో వెల్లుల్లి వేయగానే వస్తుంది స్మెల్ అబ్బో ఆ వాసకు ఆకలిమొదలవుతుంది..ఇళ్లలో ఉల్లిపాయలకు, వెల్లులికు కాడలు రావటం మనం చూసే ఉంటాం..చాలా మంది..ఉల్లి పాయలు కాడలు వస్తే..కొంతమంది..వాటిని కట్ చేసుకుని వాడుకుంటారు మరికొంతమంది పడేస్తుంటారు..అలాగే వెల్లుల్లి కాడలకు వస్తే..చాలామంది అవి పాడేపోయి అలా వచ్చాయనుకుని పారేస్తుంటారు..కానీ మొలకెత్తిన వెల్లుల్లిలో ఎంజైమ్ మూలకాలు ఎక్కువగా ఉంటాయి. వాటివల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

మొలకెత్తిన వెల్లుల్లిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు తాజా వెల్లుల్లి కంటే పాత అంటే మొలకెత్తిన వెల్లుల్లిలో ఎక్కువ పరిమాణంలో ఉంటాయట. అందుకే నిపుణులు కూడా మొలకెత్తిన వెల్లుల్లిని తినమంటున్నారు.

తీవ్రమైన వ్యాధులలో ఒకటైన క్యాన్సర్ ను వెల్లుల్లి తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ వంటి వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు.

మొలకెత్తిన వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, వైరస్‌లకు దూరంగా ఉండవచ్చు.

శరీరంలోని ఏదైనా భాగంలో రక్తం సరఫరా సరిగా కాకుంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కానీ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉండే వెల్లుల్లిని వాడడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు.

మొలకెత్తిన వెల్లుల్లిలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ధమనులను వ్యాకోచింపజేసి.. రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.

ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ప్రభావాలను కూడా నివారించవచ్చు. శరీరంపై ముడతలు, మొటిమల సమస్యను కూడా వెల్లుల్లి ద్వారా అధిగమించవచ్చు.

కాబట్టి..మొలకెత్తిన వెల్లుల్లిని పాడైందని పారేయకుండా..వాడుకోండి..అధిక ప్రయోజనాలు పొందండి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news