ఇవాళ జనసేన పార్టీ 9 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన పార్టీ 9 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది ఆ పార్టీ అధిష్టానం. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ బహిరంగ సభ జరుగనుంది.. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు పెట్టింది జనసేన పార్టీ. ఇక ఈ సభకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్.. నిన్న రాత్రి విజయవాడకు చేరుకున్నారు. అలాగే… ఈ సభ ఏర్పాట్లను జనసేన పార్టీ ప్రధాన నాయకులు నాదేండ్ల మనోహర్ దగ్గరుండి చూసుకుంటున్నారు.
సభ కు వచ్చే జనసేన కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అటు వైసీపీ సర్కార్ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎలాగైన ఆటంకాలు కలిగించాలని చూస్తోంది. ఇలాంటి తరుణంలో… జనసేన పార్టీకి ప్రజలు అండగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు అన్ని వేళలా.. అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పటం గ్రామస్తులు… ఎవరూ చేయని పని చేసి.. జనసేన పార్టీలో నూతన ఉత్సహాన్ని నింపుతున్నారు.
జనసేన పార్టీ 9 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో.. కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండదని.. బహిరంగ సభకు 20ఎకరాలు ఇవ్వడమే కాకుండా.. పార్కింగ్ కు 50 ఎకరాలు ఇచ్చి మంచి మనసును చాటుకున్నారు. అంతేకాదు.. రెండు టన్నుల(2000కేజీ )పులిహోర చేయిస్తున్నారు గ్రామస్తులు. మూడు లక్షల మజ్జిగ ప్యాకేట్స్, నాలుగు లక్షల వాటర్ ప్యాకేట్స్, మహిళల కోసం 10వేల సీట్లు కేటాయించారు.
1000 మంది పోలీసులు చెయ్యాల్సిన పనిని ఇప్పటం గ్రామస్థులు చేసి… ఏపీలోని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా..ఈ సభ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.