ఇలా పొదుపు చేస్తే నెలకి యాభై వేలు పెన్షన్..!

-

మనం చిన్న వయసులో ఉన్నప్పుడు డబ్బులు పొదుపు చేసుకుంటే తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ పొందడానికి అవుతుంది. నిజానికి సేవింగ్స్ చేయడం చాలా అవసరం. భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి నుంచే సేవింగ్స్ చేస్తే అప్పుడు చక్కగా డబ్బులు వస్తాయి చాలా మంది వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలని ఇప్పటి నుండి కూడా పొదుపు చేయడం జరుగుతోంది.

మీరు కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు డబ్బులు సేవ్ చేస్తే ఆ తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ తీసుకోవచ్చు ప్రభుత్వం కూడా దీని కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చింది. అయితే ప్రభుత్వం అందించిన స్కీమ్స్ లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే..

రిటైర్మెంట్ నుంచి బతికి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కార్పస్ నుంచి మెచ్యూరిటీ సమయంలో మొత్తం విత్‌డ్రా చెయ్యడం కుదరదు. కార్పస్‌లో 40 శాతంతో యాన్యుటీ కొనాలి. దీని ద్వారా రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది. మిగతా 60 శాతం విత్‌డ్రా చెయ్యచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. 40 శాతం కన్నా ఎక్కువతో కూడా యాన్యుటీ కొనవచ్చు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కార్పస్ నుంచి యాన్యుటీ కొనే వారికి 6 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.1 కోటితో యాన్యుటీ కొంటేనే నెలకు రూ.50,000 పెన్షన్ వస్తుంది. 40 శాతానికి రూ.1 కోటి అంటే 100 శాతానికి రూ.2.5 కోట్లు జమ అవ్వాలి.

ఇక ఎంత పొదుపు చేయాలన్నది చూస్తే.. ఈ పధకంలో 25 ఏళ్ల వయస్సులో చేరితే 35 ఏళ్ల పాటు నెలకు రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య పొదుపు చెయ్యాల్సి వుంది. 25 ఏళ్ల పాటు నెలకు రూ.19,000 నుంచి రూ.23,000 మధ్య పొదుపు చెయ్యాలి. అదే 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి అయితే 15 ఏళ్ల పాటు నెలకు రూ.59,000 నుంచి రూ.65,000 మధ్య పొదుపు చెయ్యాల్సి వుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news