ఆహారం, ఆరోగ్యం పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. పౌష్టికాహారం ఆరోగ్యాన్ని ఇస్తే అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని ఆహారాలు ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు. అయితే మారే కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పు వచ్చింది. పులగం, కిచిడి, పొంగలి, దద్దోజనం పరమాన్నం వంటివి పూర్వపు వంటలుగా మారిపోయాయి. వాటి స్థానంలో జంక్ ఫుడ్స్ వచ్చి చేరాయి. ఫలితంగా మన శరీరం తగినంత శక్తిని పొందలేక అనారోగ్యాలు వారిని పడుతుంది అని చెప్పొచ్చు. చిన్న చిన్న ఇన్ఫెక్షన్ వంటివి కూడా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండడం మనందరికీ తెలిసిందే. కారణం మన ఆహారపు అలవాట్లు అంటూ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి మంచి ఆహారపు అలవాట్లు ఏంటో చూద్దాం.
ఆరోగ్యానికి మిశ్రమ ఆహారం మంచిది. మనం రోజు వరి అన్నం తినడానికి అలవాటు పడిపోయాము. అలాగే ఉత్తరాదులు నిత్యం గోధుమ ఆహారమే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మరి ఇలా రోజు ఏదో ఒక రకమైన ధాన్యానికి పరిమితం కావడం వల్ల నష్టం లేదు. కానీ ఆశించిన అన్ని పోషకాలు మాత్రం లభించవు. వీటిలో లీసెన్స్ అనే అమైనో ఆమ్లం కొంత తక్కువ మోతాదులో ఉంటుంది. అయితే ఇది పప్పు ధాన్యాలు అధికంగా లభిస్తుంది. కాబట్టి బియ్యంలో రోజు పప్పు ధాన్యాలను కలిపి వండుకు తింటే, బియ్యంలో లోపించిన ఆమెను ఆమ్లాలు, పప్పు ధాన్యాల ద్వారా భర్తీ అవుతాయి. అలాగే పప్పు ధాన్యాలు కూడా కొన్ని అమైనో ఆమ్లాలు తక్కువ మోతాదులో ఉంటాయి. అవి బియ్యం ద్వారా అందుతాయి. ఇలా బియ్యం, మరో పప్పు ధాన్యం మిశ్రమం తినడం వల్ల ఆహారంలోని మాంసకృత్తులు సంపూర్ణం అవుతాయి. మనకు పప్పు ధాన్యాలకు కొదవలేదు. శనగ కంది, పెసర, మినుము, అలసందలు, బొబ్బర్లు, ఉలవలు, బఠానీలు వంటి ఎన్నో రకాల పప్పుధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి పూట అన్నంతో పాటు పప్పు ధాన్యాన్ని కలిపి తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు పౌష్టికాహారం నిపుణులు.
మిశ్రమ ఆహారం మంచిది అని చెప్పుకున్నాం కదా! పులగం, పొంగలి, ఇడ్లీ, వడలు వంటివన్నీ మిశ్రమ ఆహారాలు. వీటి పోషక విలువలు విడివిడిగా తీసుకునే పదార్థాల కన్నా మేలు అయిందని చెప్పొచ్చు. అలాగే కేవలం ఒకే రకమైన పప్పు ధాన్యానికి ప్రాధాన్యం ఇవ్వడం కాకుండా అన్ని రకాల పప్పు ధాన్యాలను వాడుతూ ఉండాలి. పదార్థాన్ని వండుతున్న కూడా అందులో రకరకాల గింజ ధాన్యాలను కలిపి వాడుకోవడానికి ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు. ఇలా మనం వాడే పప్పు ధాన్యాలు వల్ల మన శరీరానికి మాంసకృతులు లభిస్తాయి. వీటి ద్వారా మన శరీరానికి లభించే శక్తి కూడా ఎక్కువై కొన్ని విటమిన్‌లు కూడా శరీరానికి వీటి ద్వారానే అందుతాయి. ఇక చిరుధాన్యాలు ఎందుకు తినాలంటే? రాగులు, సజ్జలు, మొక్కజొన్న మొదలైన చిరు ధాన్యాల్లో ఖనిజ లవణాలు, విటమిన్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల వండినప్పుడు ఇది నీటిని ఎక్కువగా తీర్చుకుంటాయి. దాంతో మనం తినేటప్పుడు వీటిని నమ్మడానికి ఎక్కువ సమయం పడుతుంది.
జీర్ణం కూడా నిదానంగా జరుగుతుంది. ఫలితంగా చక్కెర పదార్థాలు జీవన కోసం లోకి చాలా నెమ్మదిగా విడుదల అవుతాయి. దాంతో త్వరగా ఆకలి కలగదు. మంచి శక్తిని ఇస్తాయి. గోధుమ పిండిలో సగానికి రాగుల పిండి గాని, జొన్న పిండి గాని సజ్జలు లేదా మరి ఏదైనా చిరుధాన్యాలు, పిండిని కలిపి వాడుకోవచ్చు. అలాగే గోధుమల పిండి గానే కాదు నానబెట్టి మూల కీర్తించి చిటికెడు ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి విటమిన్ సి కూడా అందుతుంది. అలాగే అటుకుల లో ఇనుము అధికంగా ఉంటుంది. కాబట్టి ఒక రోజు టిఫిన్‌గా దానితో ఉప్మా, పులిహోర వంటివి చేయడం మంచిది. అలాగే అటుకులు, పాలతో కలిపి తీసుకుంటే అధిక పోషకాలు లభిస్తాయట కూడా.