సీజనల్ సమస్యలు ఎక్కువయ్యాయి…ఈ జాగ్రత్తలు ముఖ్యం..!

-

సీజనల్ వ్యాధుల వల్ల మనం ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుంది వాతావరణ మార్పుల వలన అనేక రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు శీతాకాలం రావడంతో సీజనల్ వ్యాధులు వైరస్లు మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. దీంతో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు కలుగుతాయి.

ఏదేమైనా సీజన్ మారేటప్పుడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి లేకపోతే లేనిపోని సమస్యలు కలుగుతాయి మరీ ముఖ్యంగా పండగలు వస్తున్నాయి కాబట్టి అనారోగ్య సమస్యలు వస్తే పండుగ అని కూడా మర్చిపోయి సఫర్ అవ్వాల్సి వస్తుంది అలా కాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఈ చిట్కాలను పాటిస్తే ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

పోషక పదార్థాలను తీసుకోండి:

అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే పోషక పదార్థాలను తీసుకోండి రోగనిరోధక శక్తిని పెంచడానికి మార్గాలు చూసుకోండి. తీసుకునే ఆహారంలో జింక్, విటమిన్స్ వంటి పోషకాలు అందేలా చూసుకోండి.

గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి:

గోరువెచ్చని నీళ్లు తాగితే ఫ్లూ, జలుబు వంటివి రాకుండా ఉంటాయి. వీలైనంత దాకా కాచి చల్లార్చిన నీటిని తాగితే సమస్యలు మీ దరిచేరవు.

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను తీసుకోండి:

పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కాబట్టి వీలైనంత వరకు డైట్ లో చేర్చుకోండి.

వాటర్ ని ఎక్కువ తీసుకోండి:

రోజుకి ఆరు గ్లాసులు నీళ్లు తీసుకుంటే చాలా మంచిది కాబట్టి ప్రతి రోజూ మంచి నీళ్లని తాగుతూ ఉండండి.

మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకోవాలి:

జ్వరం వచ్చినట్లు అనిపిస్తే రాత్రి పూట చన్నీళ్ళతో స్నానం మానేయండి. అలానే కాస్త గొంతులో ఇబ్బందిగా ఉన్నట్లయితే కూలింగ్ వాటర్ కి దూరంగా ఉండండి. చలి వేస్తుంటే స్వెటర్ వంటివి వేసుకోండి ఇలా చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. సమస్యలు రావు.

Read more RELATED
Recommended to you

Latest news