ఏపీలో సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం దగ్గర అలలు ఎగసిపడుతున్నాయి. తీరంలో ఐదు మీటర్లు ఎత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి. సుమారు 150 మీటర్ల ముందుకు సముద్రం చొచ్చుకొచ్చింది. అలల తాకిడికి తీరం వెంబడి ఉన్న రోడ్లు ధ్వంసం అయ్యాయి. హుదూద్ తుఫాన్ తర్వాత మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో అలలు విరుచుకుపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణలో సైతం వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంతో పాటు పరిసర ప్రాంతాలు నీట ముగిగాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే.. ఈ క్రమంతో తాజాగా.. ఐఎండీ తెలంగాణకు మరో 7 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. అంతేకాకుండా.. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది ఐఎండీ. నేటి నుంచి ఈ నెల 16 వరకు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు కురుస్తాయని తెలిపిన ఐఎండీ.. అదే సమయంలో.. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలతో పాటు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. దీంతో పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది ఐఎండీ. అయితే.. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది ఐఎండీ.