హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..

-

భానుడి ప్రతాపానికి చెమటలు కక్కుతున్న హైదరాబాద్‌ వాసులకు ఆదివారం సాయంత్రం కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి.. ఈదురు గాలులు వీచాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఈ సాయంత్రం వర్షం కురిసింది. భానుడి విశ్వరూపానికి హడలిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఊరట కలిగించిందని చెప్పాలి. గత కొన్నిరోజులుగా విపరీతమైన వేడితో అవస్థలుపడుతున్న ప్రజానీకం… చల్లబడిన వాతావరణంతో ఉపశమనం పొందింది.

Heavy rain lash Hyderabad overnight

బేగంపేట, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల, బహదూర్ పల్లి, సూరారం, మల్కాజిగిరి, ఆల్వాల్, నేరేడ్ మెట్, తిరుమలగిరి, బహదూర్ పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగర శివార్లలో అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిచోట్ల ఈదురుగాలుల కారణంగా చెట్లు నేలకొరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news