Mahesh Babu : గోల్డెన్ హార్ట్… 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు

-

సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టారే. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మహేష్ బాబు.. మరో మంచి పనికిి నాంది పలికారు. ఏకంగా ఒకేరోజు 30 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు నమ్రత. ఏపీ గవర్నర్, ఆంధ్ర ఆసుపత్రికి నమ్రత కృతజ్ఞతలు తెలిపారు.

నిన్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని చిన్నారులందరికీ గుండె ఆపరేషన్లు చేయించారు మహేష్ బాబు.. ఈ  విషయాన్ని నమ్రతా శిరోద్కర్ ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ ఉదారత పై అభిమానులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఎం బి ఫౌండేషన్ పేరుతో మహేష్ బాబు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో మంది చిన్నారులకు ఈ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తూ అండగా నిలుస్తున్నారు మహేష్ బాబు.మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ” సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు

Read more RELATED
Recommended to you

Latest news