ఆర్జీవీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరో నిఖిల్‌..!

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘పవర్ స్టార్’ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందిస్తూ.. “శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థం అయిందిగా?” అంటూ ట్వీట్ పెట్టారు. దీనికి ‘పవర్ స్టార్’, ‘పవన్ కల్యాణ్’ అనే హ్యాష్ ట్యాగ్స్ తో పాటు చిన్న వీడియోను కూడా జోడించాడు.

పవర్ స్టార్ అంటూ వర్మ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ‘ పవర్ స్టార్’ పేరుతో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతి కథ అంటూ సినిమాను ప్రకటించాడు. ‘గడ్డి తింటావా’ అంటూ ఓ పాటను కూడా విడుదల చేశారు. ఇది అతని అభిమానులకే కాదు టాలీవుడ్ సెలబ్రెటీలకు చిరాకు తెప్పించింది. దీంతో ఆయనపై ఒక్కొక్కరుగా మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news