భారత్, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరిగినట్లు సమాచారం. డిసెంబర్ 9న ఈ ఘటన జరిగింది. తవాంగ్ సమీపంలో ఈ ఘర్షణ జరిగినట్లు.. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మొత్తం 30 మంది జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9 న చైనా దళాలు వాస్తవ నియంత్రణ రేఖపై ముందుకు సాగడానికి ప్రయత్నించాయి. దీనికి భారత సైనికులు ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ ఘర్షణలో కొందరు సైనికులు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇరువైపులా సైనికులు గాయపడ్డారని, చైనా వైపు నుంచి మరింత మంది సైనికులు గాయపడ్డారని భారత ఆర్మీకి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి.అయితే సైనికులెవరూ మరణించినట్లు సమాచారం లేదు. డిసెంబర్ 9న వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వర్గాలు ధృవీకరించాయి.